మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియపూర్ డివిజన్ ప్రశాంత్ నగర్ లో ఉన్న శ్రీ సీతారామంజనేయ స్వామి ఆలయంలో కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ప్రధాన అర్చకుడు రాజగోపాల చారి ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ, కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డిలు శివుడికి అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు గాంధీతోపాటు మంజుల రఘునాథ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్ లకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసంలో శివుడికి అభిషేకం చేయడం జరిగిందన్నారు. ఆ శివుడి కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నిండాలని వేడుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సుప్రజా ప్రవీణ్, గోపి కృష్ణ, పురుషోత్తం యాదవ్ కుమార్ పాల్గొన్నారు.

