ప్రజా సమస్యల‌ పరిష్కారానికి ‌కృషి – బస్తీబాటలో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నానక్ రామ్ గూడ లో స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి బస్తీబాట చేపట్టారు. బస్తీబాటలో‌ భాగంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో మంచి నీటి సరఫరా, డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాల పనితీరుపై తనిఖీ చేశారు. సంబంధిత‌ అధికారులతో మాట్లాడి డ్రైనేజీ, సీసీ రోడ్లు, మంచి నీటి, మురికి కాలువ తదితర పనులు పూర్తి చేయాలన్నారు. చెత్తాచెదారం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పరిసరాలను‌‌ శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఏడాదిన్నర కాలంలో డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి ‌కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈ విశాలాక్షి, ఎలక్ట్రికల్ ఏఈ రాజశేఖర్, హెచ్ఎండబ్ల్యుఎస్ మేనేజర్ నరేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ శివ సింగ్, తిరుపతి, సీనియర్ నాయకులు కైలాష్ సింగ్, ప్రభాకర్, నర్సింగ్ నాయక్ మాధవ రెడ్డి, ముత్యం రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, దర్శన్ సింగ్, రాందీన్ సింగ్, రాజ్ కుమార్ సింగ్, గుల్షన్ సింగ్, విజయ్ సింగ్, విక్కీ సింగ్ యాదగిరి, ధన్ రాజ్, శ్రీనివాస్ రెడ్డి, జయ్ రెడ్డి, అశోక్ సింగ్, రమేష్ గౌడ్, విశాల్ సింగ్, ప్రకాష్, శంఖేష్ సింగ్, దేవరకొండ గోపాల్, అరవింద్ సింగ్ నరేందర్, శానిటేషన్ సూపర్ వైజర్ కిష్టయ్య, నానక్ రామ్ గూడ వాసులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

నానక్ రాంగూడలో ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here