శేరిలింగంపల్లి, మార్చి 8 (నమస్తే శేరిలింగంపల్లి): అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మిరియాల రాఘవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చందానగర్ లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ మిర్యాల రాఘవరావు, డైరెక్టర్స్ మిరియాల ప్రీతం , యామిని దివ్య ప్రీతం, గాలి అనిల్ కుమార్, కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ హాజరయ్యారు. రాజకీయ, విద్య, వైద్య, వ్యాపార రంగాలలో ఉన్నత స్థితికి చేరుకుని సమాజ సేవ చేస్తున్న మహిళలను సన్మానించారు. సన్మానం అందుకున్న వారిలో పూజిత గౌడ్, నాగలక్ష్మి, కరుణ , వరలక్ష్మి ఉన్నారు. కార్యక్రమంలో ఆటలు పాటలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పోటీలలో విజేతలైన వారికి బహుమతి ప్రదానం చేశారు.