తెరాసతోనే న‌గ‌రం సంపూర్ణ అభివృద్ది

  • జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్నం సునీత మ‌హేంద‌ర్ రెడ్డి, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగేందర్ గౌడ్

హ‌ఫీజ్‌పేట‌‌‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెరాస‌కు ఓటు వేసి అభ్య‌ర్థుల‌ను గెలిపిస్తేనే హైదరాబాద్ న‌గ‌ర సంపూర్ణ అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌ని నాయ‌కులు అన్నారు. హ‌ఫీజ్‌పేట డివిజ‌న్ ప‌రిధిలో హ‌ఫీజ్‌పేట‌, మాదాపూర్ డివిజ‌న్ల తెరాస అభ్య‌ర్థులు పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌ల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ర్యాలీలో వికారాబాద్ జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్నం సునీత మ‌హేంద‌ర్ రెడ్డి, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగేందర్ గౌడ్ లు పాల్గొన్నారు.

ర్యాలీలో పాల్గొన్న జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్నం సునీత మ‌హేంద‌ర్ రెడ్డి, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగేందర్ గౌడ్, పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. డిసెంబర్ 1వ తేదీన ప్ర‌జ‌లు త‌మ అమూల్యమైన ఓటును టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థుల‌కు వేసి మళ్ళీ ప్ర‌జ‌ల‌కు సేవ చేసుకునే అవకాశాన్ని అందించాల‌ని కోరారు. గ‌తంలో ఎన్న‌డూ లేనంత అభివృద్ధి కేవ‌లం తెరాస హ‌యాంలోనే జ‌రిగిందన్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన నాయకులు కేవ‌లం ఎన్నిక‌ల ఉన్న స‌మ‌యంలోనే ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వ‌స్తార‌ని అన్నారు. హైద‌రాబాద్‌కు వ‌ర‌దలు వ‌చ్చిన‌ప్పుడు వారు ఎటు పోయార‌ని అన్నారు. కేవ‌లం తెరాస ప్ర‌భుత్వం మాత్ర‌మే ప్ర‌జ‌ల‌ను ఆదుకుంద‌ని తెలిపారు. తెరాస అభ్య‌ర్థుల‌కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాల‌ని కోరారు. అనంత‌రం మాదాపూర్ డివిజన్ లోని కృష్ణ కాలనీలో వారు ఇంటింటికి ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. కారు గుర్తుకు ఓటు వేయాల‌ని కోరారు.

ర్యాలీ నిర్వ‌హిస్తున్న తెరాస నాయ‌కులు, కార్య‌క‌ర్తలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here