శేరిలింగంపల్లి, ఏప్రిల్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): లింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి నగర్ గ్రామంలో శ్రీ హనుమాన్ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు హనుమాన్ జయంతి వేడుకలలో శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి కంటెస్టెంట్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని శోభయాత్ర ప్రారంభించి స్వామివారి ఆశీస్సులను పొందారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ శ్రీరాముని పట్ల హనుమంతునికి ఉన్న అచంచలమైన భక్తి మనందరికీ ఆదర్శం, భక్తి ఉంటే ఎంతటి కష్టమైనా సులువుగా దాటగలమని ఆయన జీవితం మనకు నేర్పుతుంది. ఆయన ధైర్యం, సాహసం అసామాన్యం. ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకుండా పోరాడే తత్వాన్ని మనం ఆయన నుండి నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి కాంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్, సీనియర్ నాయకులు చంద్రమోహన్, కిషోర్ ముదిరాజ్, కేశవులు, పుట్ట వినయ్ గౌడ్ , రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.