శేరిలింగంపల్లి, ఏప్రిల్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని హై టెన్షన్ లైన్ లోని HDFC బ్యాంక్ నుండి సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీ వరకు నూతనంగా నిర్మాణం చేపట్టబోయే (Storm water Drain) వరద నీటి కాలువ నిర్మాణ పనులు చేపట్టే పరిసర ప్రాంతాలను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ రానున్న వర్షాకాలన్నీ దృష్టి లో ఉంచుకొని భవిష్యత్తులో పరిసర ప్రాంత కాలనీలు ముంపుకు గురి కాకుండా వరదనీటి కాలువ పనులను చేపట్టడం జరుగుతున్నదని, త్వరలోనే వరద నీటి కాలువ పనులను చేపట్టి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు తెలపడం జరిగిందని కార్పొరేటర్ శ్రీకాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం ఏఈ సంతోష్, వర్క్ ఇన్‌స్పెక్టర్లు నవీన్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.