కాల‌నీలో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలంటు ప్ర‌భుత్వ విప్ గాంధీని క‌లిసిన వెంక‌ట్‌రెడ్డి న‌గ‌ర్ వాసులు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని వెంకట్ రెడ్డి నగర్ కాలనీ వాసులు గురువారం ప్రభుత్వ విప్ ఆరెక‌పూడిని మర్యాదపూర్వకంగా క‌లిశారు. కాల‌నీలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలంటు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. కాల‌నీలో ప్ర‌ధానంగా డ్రైనేజీ, రోడ్లు, మంచినీటి స‌మ‌స్య‌ల‌తో అవ‌స్థ‌లు ప‌డుతున్నామని గాంధీ దృష్ట‌కి తీసుకువ‌చ్చారు. సానుకూలంగా స్పందించిన గాంధీ ప్రాధాన్య‌తా క్ర‌మంలో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో కాల‌నీ వాసులు జయంత్ కుమార్, అశోక్ కుమార్, సమ్మాజీ, మహ్మద్ పటేల్, మహ్మద్ షరీఫ్, అఖిలేష్ కుమార్, మధుసూదన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ప్ర‌భుత్వ విప్ గాంధీకి విన‌తీ ప‌త్రం అంద‌జేస్తున్న వెంక‌ట్‌రెడ్డి న‌గ‌ర్ వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here