మియాపూర్‌లో రోడ్డుప్రమాదానికి గురైన ఈ మ‌హిళ ఎవ‌రో మీకు తెలుసా..?

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: రోడ్డు దాటుతుండగా వాహ‌నం ఢీ కొట్ట‌డంతో ప్ర‌మాదానికి గురైన ఓ గుర్తు తెలియ‌ని మ‌హిళ ప్ర‌స్తుతం అప‌స్మార‌క స్థితిలో చికిత్స పొందుతోంది. గురువారం సాయంత్రం మియాపూర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోన దీప్తి శ్రీ‌న‌గ‌ర్ వ‌ద్ద సాయంత్రం 5:30 గం.ల స‌మ‌యంలో ఫోటోలో క‌నిపిస్తున్న మ‌హిళ రోడ్డు దాటుతుండ‌గా ప్ర‌మాదానికి గురైంది. వెంట‌నే పోలీసులు స‌ద‌రు మ‌హిళ‌ను స‌మీపంలోని శ్రీ‌క‌ర ఆసుప‌త్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. స‌ద‌రు మ‌హిళ ప్ర‌స్తుతం అప‌స్మార‌క స్థితిలో ఉంద‌ని ఆచూకీ తెలిసిన వారు వెంట‌నే మియాపూర్ పోలీసుల‌కు 9490617129 నెంబ‌రు ద్వారా స‌మాచారం అందించాల‌ని ఇన్‌స్పెక్ట‌ర్ వెంక‌టేష్‌ సామ‌ల తెలిపారు.

కాగా శుక్ర‌వారం ఉద‌యం ప్ర‌మాదానికి గురైన మ‌హిళ వివ‌రాలు తెలిసిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. పాపిరెడ్డికి చెందిన ఈ మ‌హిళ ఇళ్ల‌లో ప‌నిమ‌నిషిగా చేస్తూ జీవ‌నం సాగిస్తుంద‌ని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here