కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా అమలులోకి తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 8వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్న రైతులు నిర్వహించ తలపెట్టిన భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని కార్పొరేటర్ హమీద్ పటేల్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు డివిజన్ పరిధిలోని తెరాస నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలన్నారు.
