పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం: జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 6 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ద్యేయం అని, ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేర‌కు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నామ‌ని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని వివేకానంద నగర్ డివిజన్ వెంకటేశ్వర నగర్ రేషన్ దుకాణంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకుడు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు, డివిజన్ అధ్యక్షుడు బాష్పక యాదగిరి, రంగారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు, కాంటెస్టడ కార్పొరేటర్ కల్పన ఏకాంత్ గౌడ్, బాష్పక నాగమణి, నాయకులతో కలిసి పేదలకు బియ్యాన్ని జగదీశ్వర్ గౌడ్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించిందని, ఈ పథకం ద్వారా తెలంగాణలో 89.95 లక్షల రేషన్ కార్డుదారులకు, 2.81 కోట్ల మంది లబ్ధిదారులకు లబ్ది జ‌రుగుతుంద‌ని అన్నారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని, రాష్ట్రంలో దాదాపు 84 శాతం మంది పేదలకు ప్రజాప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం అందించబోతోందని అన్నారు. రాష్ట్రంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమ‌ని అన్నారు. ఏడాదిలో రెండు సీజన్లలో సేకరించే సన్నధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు అల్వల భాస్కర్, ముకన్న, దొరపల్లి పరుశురాములు, సంగి విజయ, కచ్చి గల రమేష్, రాఘవులు, దండే శీను, సూర్య ప్రకాష్ రావు, దుర్గారాణి, వెంకటస్వామి సాగర్, నాగుల మల్లేష్, బోడ అశోక్, శాంసన్, బోడ ఎల్లశం, షేక్ హయ్యద్, ఎండి యూసుఫ్, వెంకన్న, కుమార్ యాదవ్, ఏక్ నాథ్, విష్ణు, ఎరుపుల శీను, శాంతమ్మ, పిల్లి నాగమణి, షాలిని, ఎస్పీ జితేందర్, సంపంగి యాదగిరి, వెంకట్, జ్యోతి, స్వప్న, అంబిక తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here