శేరిలింగంపల్లి, ఏప్రిల్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): అజాతశత్రువుగా భారత రాజకీయ, సామాజిక రంగాల్లో వెలుగొందిన బాబూజీ అని పిలిపించుకున్న ఆయన నడిచిన బాట, అనుసరించిన ఆదర్శాలు చూపిన సంస్కరణ మార్గాలనూ గుర్తుచేసుకుంటూ, ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. గొప్ప సంఘసంస్కర్త, స్వతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని రీక్షపుల్లర్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకుడు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు, డివిజన్ అధ్యక్షుడు బాష్పక యాదగిరి, రంగారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు, కాంటెస్టడ కార్పొరేటర్ కల్పన ఏకాంత్ గౌడ్, బాష్పక నాగమణి, నాయకులతో కలిసి జగ్జీవన్ రామ్ విగ్రహానికి జగదీశ్వర్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ రాజకీయాల్లో కాంగ్రెస్(ఇందిరా) పార్టీ అధ్యక్షుడిగా కూడా ప నిచేసిన గొప్ప మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. అంటరానివారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహా నేత అని,దేశంలో హరిత విప్లవం విజయవంతం చేయడంలో బాబు జగ్జీవన్ రామ్ కీలకపాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అల్వల భాస్కర్, దొరపల్లి పరుశురాములు, సంగి విజయ, కచ్చి గల రమేష్, రాఘవులు, దండే శీను, సూర్య ప్రకాష్ రావు, దుర్గారాణి, వెంకటస్వామి సాగర్, నాగుల మల్లేష్, బోడ అశోక్, ఎన్.ఏస్.యు.ఐ అద్యక్షుడు శాంసన్, బోడ ఎల్లశం,షేక్ హయ్యద్, ఎండి యూసుఫ్, వెంకన్న, కుమార్ యాదవ్, ఏక్ నాథ్, విష్ణు, ఎరుపుల శీను, శాంతమ్మ, పిల్లి నాగమణి, షాలిని, ఎస్పీ జితేందర్, సంపంగి యాదగిరి, వెంకట్, జ్యోతి, స్వప్న, అంబిక తదితరులు పాల్గొన్నారు.