శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులైన తరుణ్ చుగ్‌కు శేరిలింగంపల్లి బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. నగరంలో రెండు రోజుల పర్యటన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన తరుణ్ చుగ్‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆయనకు స్వాగతం పలికేందుకు గాను బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎం.రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నుంచి భారీ సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు శంషాబాద్‌కు తరలివెళ్లారు.


తరుణ్ చుగ్‌ను కలిసిన మహేష్ యాదవ్…
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జి తరుణ్ చుగ్‌ను శేరిలింగంపల్లి బీజేపీ నాయకుడు బోయిని మహేష్ యాదవ్ శుక్రవారం కలిశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తరుణ్ చుగ్‌ను కలిసి మహేష్ యాదవ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
