శేరిలింగంపల్లి, అక్టోబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డిని కలిసి పలు అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న పనులకు నిధులను వెంటనే మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అయ్యేలా చూస్తామని, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
