శేరిలింగంపల్లి, అక్టోబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్ పేట్ కి చెందిన వహీద్ అలీకి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా CMRF-LOC ద్వారా మంజూరైన రూ.2,50,000 ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF- LOC మంజూరు పత్రాన్ని బాధిత కుటుంబానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖాసీం, జుబేదా తదితరులు పాల్గొన్నారు.
