శేరిలింగంపల్లి, అక్టోబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమయ్యపురంలో అన్నమాచార్య భావనా వాహిని సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అన్నదానం, సాయంత్రం అన్నమ స్వరార్చన సభక్తిపూర్వంగా అందించారు. స్వరార్చనలో భాగంగా శ్రీ శృతిలయ మ్యూజిక్ అకాడమీ గురువు శివరంజని, వారి శిష్యులు సంయుక్తంగా వక్రతుండ మహాకాయ, జయ గణనాయక, నారాయణతే నమో నమో అనే కీర్తనలకు స్వరసేవ అందించారు. అనంతరం కళాకారులకు, ముఖ్య అతిథికి అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ వ్యవస్థాపకులు డా. శోభారాజు, సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నంద కుమార్ ఙ్ఞాపికను అందించారు.