శేరిలింగంపల్లి, జనవరి 20 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని గురునాథం చెరువు సుందరికరణలో భాగంగా Nexus select Malls కంపెనీ వారి CSR ఫండ్స్ ద్వారా మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపట్టిన చెరువు పునర్జీవనంలో భాగంగా సుందరీకరణ, పునరుద్ధరణ పనులను స్థానిక నాయకులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. గురునాథం చెరువుకు శాశ్వత పరిష్కారం దిశగా చెరువును అభివృద్ధి చేపట్టడం జరిగిందని, మురికి కూపంలాంటి చెరువు స్వచ్చమైన మంచి నీరు లాంటి చెరువుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పని చేసి నిరూపించడం జరుగుతుందని అన్నారు. చెరువు పునర్జీవనం తరువాత చెరువు కట్ట చుట్టూ చెట్లు పెంచి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మల్లిగవాడ్ ఫౌండేషన్ సభ్యులు చైతన్య, రాము, స్థానిక నాయకులు లోకేష్ , రమేష్, అనిల్ , రాజేష్ , సుధాకర్ ,కె ఏస్ బాబు తదిరులు పాల్గొన్నారు.
