భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని విశ్వేశరయ్య కాలనీ KSR ఎన్‌క్లేవ్ కాలనీలలో రూ.1 కోటి 35 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, రాగం నాగేందర్ యాదవ్, జలమండలి అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని అన్నారు. పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు, త‌మ‌ కార్పొరేటర్లు త‌మ‌ దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవతో శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు DGM వెంకటేశ్వర్లు, మేనేజర్ సుబ్రమణ్యం, నాయకులు, కార్యకర్తలు,కాలనీ వాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

యూజీడీ పైప్ లైన్ నిర్మాణ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన PAC చైర్మన్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here