శేరిలింగంపల్లి, జనవరి 20 (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్, సలహాదారు బేరి రామచంద్ర యాదవ్, తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సర్పంచుల సంఘం వ్యవస్థాపకుడు సౌధాని భూమన్న యాదవ్ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మందాడి అంజన్ కుమార్ యాదవ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం గొర్రె కాపరుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 18 శాతం ఉన్న గొల్ల కురుమలకు రాజకీయ రంగంలో రిజర్వేషన్లు ఇవ్వాలని, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ పోస్టులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, దేవాలయాలకు చైర్మన్ పదవులను గొర్రె కాపరులకు ఇవ్వాలని, ప్రమాదవశాస్తూ మరణిస్తే జీవిత బీమా ద్వారా కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని అన్నారు. 80% సబ్సిడీ ద్వారా మినీ పాల డైరీలు ఇవ్వాలని, పిడుగుపాటుకు చనిపోయిన గొర్రెలకు ఇన్సూరెన్స్ ద్వారా నష్టపరిహారం ప్రతి జీవానికి రూ.5000 అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అధ్యక్షుడు మధు యాదవ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు చేగొండ రాజన్న యాదవ్, సంతోష్ యాదవ్, సత్యనారాయణ యాదవ్, మహేష్ యాదవ్, రాజేష్ యాదవ్, ఎంకే రాజేష్, వెంకటేష్, నాయకులు పాల్గొన్నారు.
