శేరిలింగంపల్లి, అక్టోబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని మురళీధర్ సొసైటీ కాలనీలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ లో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మురళీధర్ సొసైటీ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీ లో నిత్యం డ్రైనేజి పొంగి పొర్లుతుంది అని , ఔట్ లెట్ సరిగ్గా లేక రోడ్ల పై ప్రవహిస్తుంది అని , డ్రైనేజి సమస్య తీవ్రమైందని, ఔట్ లెట్ సమస్య ను పరిష్కరించి డ్రైనేజి సమస్యను వెంటనే పరిష్కరించాలని, సీసీ రోడ్లు వేయాలని, మంచి నీటి వ్యవస్థ ను మెరుగుపరచాలని కోరారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ మురళీధర్ సొసైటీ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ లో నెలకొన్న డ్రైనేజి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని, డ్రైనేజి సమస్య కు శాశ్వత పరిష్కారం చూపుతామని, మ్యాన్ హోల్ నుండి మ్యాన్ హోల్ వరకు పూడిక తీసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్నారు. ఔట్ లెట్ సమస్య ను త్వరితగతిన పరిష్కరించాలని జలమండలి అధికారులకు సూచించారు. అవసరమున్న చోట మ్యాన్ హోల్స్ పునరుద్ధరించాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన, డ్రైనేజి, రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని, త్వరలోనే సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తామని, కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మురళీధర్ సొసైటీ కాలనీ వాసులు GS మూర్తి, శంకర్, దయాకర్ రెడ్డి, వరలక్ష్మి, శ్రీనివాస్ రెడ్డి, ప్రసాద్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.






