శేరిలింగంపల్లి, జనవరి 21 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందివ్వడమే ప్రభుత్వ లక్ష్యం అని, ఎలాంటి తారతమ్యాలు లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పంపిణీ వంటి పథకాలు అమలుకు చందానగర్ డివిజన్ పరిధిలోని వార్డ్ కార్యాలయంలో జరిగిన వార్డ్ సభ కార్యక్రమంలో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, డీసీ మోహన్ రెడ్డిలతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందివ్వడమే ప్రభుత్వ లక్ష్యం అని, ఎలాంటి తారతమ్యాలు లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరగాలని , ప్రతి పేదవాడికి సంక్షేమ పథకం అందేలా అధికారులు కృషి చేయాలని, నిజమైన లబ్ధిదారులందరికి న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
