శేరిలింగంపల్లి, జనవరి 21 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇందిరమ్మ సభ కార్యక్రమంలో భాగంగా హాఫీజ్ పేట్ వార్డ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులతో కలిసి డివిజన్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు జరిగే వార్డు సభల్లో అర్హులైన ప్రతి ఒక్క రికి రేషన్‌కార్డు, ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా తదితర పథకాలు అందేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్, కనకమామిడి నరందేర్ గౌడ్, సత్తార్, సయ్యద్ తహెర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
