శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 15 (నమస్తే శేరిలింగంపల్లి): కైదమ్మ కుంట చెరువు పునరుద్ధరణతో దశ దిశ మారుతుందని, చెరువును సుజల జలంతో అపురూప దృశ్యకావ్యంగా ఆవిష్కృతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని కైదమ్మ కుంట చెరువు సుందరీకరణలో భాగంగా Nexus select Malls కంపెనీ వారి CSR ఫండ్స్ ద్వారా మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపట్టనున్న చెరువు పునర్జీవనంలో భాగంగా సుందరీకరణ, పునరుద్ధరణ పనులను ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు.
ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ కైదమ్మ కుంట చెరువులో మురుగు నీరు కలవకుండా ఇరిగేషన్ అధికారులు గతంలో UGD పైప్ లైన్ చేపట్టడం జరిగిందని, ఈ పైప్ లైన్ పనులు సరిగ్గా చేపట్టక నిరుపయోగంగా దేనికి పనికి రాకుండాపోవడంతో ఔట్ లెట్ లో నీరు సక్రమంగా పోవడం లేదని అన్నారు. ఇరిగేషన్ అధికారుల పని తీరు పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాలనీ వాసులు ఈ సమస్యను PAC చైర్మన్ గాంధీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్య కు శాశ్వత పరిష్కారంగా ఔట్ లెట్ ను సరి చేసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
కైదమ్మ కుంట చెరువు పునరుద్ధరణ ప్రభుత్వం, పరిశ్రమలు, సమాజం మధ్య భాగస్వామ్య ప్రయత్నాలు అర్ధవంతమైన పర్యావరణ పురోగతిని ఎలా నడిపించగలదో చెప్పడానికి ఒక శక్తివంతమైన ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ఈ ప్రాజెక్ట్ కీలకమైన సహజ వనరులను పునరుజ్జీవింపజేయడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా భవిష్యత్తులో సుస్థిరమైన అభివృద్ధి కోసం ఒక నమూనాను ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు DE నళిని, AE పావని, రెవిన్యూ అధికారులు సర్వేయర్ జగదీశ్వర్, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, నాయకులు బాలింగ్ గౌతమ్ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, దాత్రినాథ్ గౌడ్, పవన్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్, మల్లేష్ గౌడ్, ప్రకాష్ గౌడ్, సురేష్ , సాదిక్, ఐటీ సంస్థ ప్రతినిధులు చైతన్య తదితరులు పాల్గొన్నారు.