శ్రీ‌నివాస్ రెడ్డి నాయ‌క‌త్వంలో రంగారెడ్డి అర్బ‌న్‌లో పాగా వేస్తాం: రవికుమార్ యాదవ్

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 8 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించ‌డ‌మే కాక‌ భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతాలు తెలిసిన విజన్ ఉన్న నాయకుడు వానిపల్లి శ్రీనివాస్ రెడ్డి అని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ అన్నారు. ఎల్బీనగర్ వనస్థలిపురం M.E గార్డెన్ ఫంక్షన్ హాల్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన‌ వానిపల్లి శ్రీనివాస్ రెడ్డికి ప‌లువురు శుభాకాంక్ష‌లు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మల్కాజ్‌గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య, AVN రెడ్డి , మాజీ ఎమ్మెల్సీలు రామచంద్రరావు , NVSS ప్రభాకర్, GS ప్రేమేందర్ రెడ్డి, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా, రాష్ట్ర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ర‌వికుమార్ యాద‌వ్ మాట్లాడుతూ శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో రంగారెడ్డి అర్బన్ జిల్లాలో LB నగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ అత్యంత శక్తివంతమైన పార్టీగా రూపుదిద్దుకోవాలని అన్నారు. శ్రీ‌నివాస్ రెడ్డి గత కొన్ని సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీకి విశిష్ట సేవలందిస్తూ అంచలంచలుగా ఎదిగిన నాయకుడని, ప్రజా సమస్యలపై పాలకపక్షాలతో ఎప్పటికప్పుడు ఎనలేని పోరాటం చేసిన గొప్ప నాయకుడని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోనే రంగారెడ్డి అర్బన్ జిల్లా శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో పార్టీ కార్యక్రమాలలో జరగబోయే ఎన్నికలలో ముందంజలో ఉండి న‌డిపిస్తార‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు, కంటెస్టెంట్ కార్పొరేటర్లు, రాష్ట్ర , జిల్లా పదాధికారులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా మోర్చా యువ మోర్చా ఓబీసి మోర్చా, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here