నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్, హఫీజ్ పేట్ డివిజన్ల అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నామని మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని కొత్త కుంట, గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీలో స్థానికులతో కలిసి పర్యటించారు. కొత్త కుంట చెరువులోకి మురికి నీరు రాకుండా చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. మాదాపూర్, హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా అహర్నిశలు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సంగా రెడ్డి, హరి, మురళి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
