శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 17 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శిల్ప వ్యాలీ కాలనీ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా శిల్ప వ్యాలీ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్లను వేయాలని, వరద నీటి కాల్వ, UGD పనులు చేపట్టాలని, మంచి నీటి వ్యవస్థను మెరుగుపరచాలని, వీధి దీపాల వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ త్వరలోనే కాలనీలో పర్యటిస్తానని, శిల్ప వ్యాలీ కాలనీలో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని అన్నారు. కాలనీలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామని, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను, UGD, వరద నీటి కాల్వ నిర్మాణం పనులను అతి త్వరలో చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, ప్రజలకు ఇబ్బంది లేకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో శిల్ప వ్యాలీ కాలనీ వాసులు ధీరజ్, గౌతమ్, విద్య సాగర్, గోవర్ధన్ రెడ్డి, విజేందర్ రెడ్డి, సుబ్బారెడ్డి, దిలీప్, బాబు రావు, మణికంఠ , ఆనంద్, మోహన్, వినయ్, ప్రణీత్, మనోహర్, ప్రవీణ్, సంపత్, శోభన, బాల విష్ణు, భరత్, సాయి వినయ్, నవీన్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.