శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 16 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీయ వర్మ తన కూచిపూడి నృత్య ప్రదర్శనలో మండూక శబ్దం, మరకత మణిమయ అంశాలను ప్రదర్శించి మెప్పించారు. లలిత ధనలక్ష్మి గొల్లపల్లి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో వినాయక కౌతం, బ్రహ్మాంజలి, జతిస్వరం, మూషిక వాహన, శారదాంబ , చేరి యశోదకు, స్వరజతి, గరుడ గమన, లలిత హారతి అంశాలను ఐశ్వర్య, నిత్య, తన్మయి, భవ్య, తేజశ్రీ, హిమ వర్షిణి, సంరిత, దీక్షిత, మానస అనన్య మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు. నాట్య గురువు కాంతా రావు అన్నమాచార్య గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజీ లెక్చరర్ విచ్చేసి కళాకారులను అభినందించారు.