శేరిలింగంపల్లి, ఏప్రిల్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోనీ నాగార్జున ఎనక్లెవ్ కాలనీలోని ఎస్ ఆర్ ఫార్చ్యూన్ సిటీ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ వాసులు, నడిగడ్డ తాండ మైనార్టీ నాయకులు పలు సమస్యలు,చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ.. మియాపూర్ డివిజన్ పరిధిలోని నాగార్జున ఎనక్లెవ్ కాలనీలోని ఎస్ ఆర్ ఫార్చ్యూన్ సిటీ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ వాసులు, నడిగడ్డ తాండ వాసులు, స్థానికంగా ఉన్న సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై తనను కలవడం జరిగిందని, ఎస్ ఆర్ ఫార్చ్యూన్ సిటీ అపార్ట్మెంట్స్, నడిగడ్డ తాండ లో స్వయంగా వెళ్లి పర్యటించి సమస్యలను పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి కాలనీలో మౌళిక వసతులు కల్పిస్తామన్నారు. కాలనీలలో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు అష్రఫ్, ఎస్ ఆర్ ఫార్చ్యూన్ సిటీ అపార్ట్మెంట్స్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, వెనిగళ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శివరామకృష్ణ, అశోక్ బాబు, శివదేవ్, అనిల్ రెడ్డి, హరీష్, నడిగడ్డ తండా వాసులు షేక్ ఇలియాస్, షేక్ సలీం, కలీల్, జాఫర్, అబ్బాస్, ఇస్మాయిల్, ఫహీం, ఫర్దీన్, సాబేర్, సుఫీయన్, చాన్, మహమ్మద్ సలీం, ఆయన్, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.