దాహార్తిని తీర్చే చ‌లివేంద్రాల ఏర్పాటు అభినంద‌నీయం: రవికుమార్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చలివేంద్రం అంటే కేవలం చల్లటి నీటిని అందించే ప్రదేశం మాత్రమే కాదు, అది మానవత్వానికి, దాతృత్వానికి ప్రతీక అని, ఎండలో అల్లాడుతున్న వారికి చల్లటి నీటిని అందించి, వారి దాహార్తిని తీర్చడం ఒక గొప్ప సేవ అని శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ అన్నారు. మియాపూర్ డివిజన్ లో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, ఆర్ కే వై టీ అధ్యక్షుడు గుండె గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని డివిజన్ ముఖ్య నాయకులతో కలిసి ర‌వికుమార్ యాద‌వ్‌ ప్రారంభించారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ చలివేంద్రాలను ఏర్పాటు చెయ్యాలని, సమాజంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే స్ఫూర్తి ప్రతి మనిషిలో కలగాలని రవికుమార్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగుల్ గౌడ్, లక్ష్మణ్ ముదిరాజ్, మనోహర్ గౌడ్, మాణిక్ రావు, రాజేష్ గౌడ్, శ్రీనివాస్, జితేందర్, శివరాజ్ , ప్రసాద్, రాము, శ్రీనివాస యాదవ్, ముఖేష్ గౌడ్, సురేష్ ముదిరాజ్ , విజయేందర్, ప్రభాకర్ , చంద్రకాంత్, ప్రవీణ్, పాపయ్య, చందు, గోపి, మంజుల పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here