శేరిలింగంపల్లి, ఏప్రిల్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్ మోహర్ పార్క్ కాలనీ లో రోడ్డు నిర్మాణ పనులు పూర్తయిన శుభసందర్భంగా గుల్ మొహర్ పార్క్ కాలనీ వాసులు కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియచేశారు. ఈ సందర్భంగా గుల్ మోహర్ పార్క్ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీ లో ఇటీవల సీసీ రోడ్ల పనులు పూర్తిచేసిన సందర్భంగా PAC చైర్మన్ గాంధీకి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాం అని అన్నారు. కాలనీ ని ఆయన సహకారంతో ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దుతామని, అదేవిధంగా కాలనీ లో అసంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్ల ను పూర్తి చేయాలని, డ్రైనేజి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు PAC చైర్మన్ గాంధీకి విన్నవించుకున్నారు.
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ గుల్ మోహర్ పార్క్ లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని, రోడ్డు పనులు పూర్తవడం చాలా సంతోషకరమైన విషయం అని, గుల్ మోహర్ కాలనీ ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, అదేవిధంగా కాలనీ లో అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లును త్వరలోనే పూర్తి చేస్తానని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. ఈ కార్యక్రమంలో గుల్ మోహర్ కాలనీ ప్రెసిడెంట్ షేక్ ఖాసీం, జనరల్ సెక్రెటరీ ఆనంద్ కుమార్, నాగన్న, విల్సన్, కుమార్, గంగి శెట్టి, శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, భాస్కర్ నాయుడు, సాగర్, కిరణ్ కుమార్, ఆడమ్, శర్మ, ముని కుమార్ తదితరులు పాల్గొన్నారు.