శేరిలింగంపల్లి, జనవరి 20 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బర్ల కుంట చెరువు సుందరీకరణ, అభివృద్ధి నిర్మాణం పనులను కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ బర్ల కుంట చెరువుకు త్వరలోనే మహర్దశ కలుగుతుందని అన్నారు. చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని, చెరువు సుందరీకరణ పనులు చేపట్టి సుందర వన శోభితంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ,కార్యకర్తలు, మహిళలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
