తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదాల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం నూతన సంవ‌త్స‌ర క్యాలెండర్ ను సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్, రాష్ట్ర సలహాదారు బేరి రామచంద్ర యాదవ్, తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సర్పంచుల సంఘం వ్యవస్థాపకుడు సౌధాని భూమన్న యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఎంపి ఆర్ కృష్ణయ్య చేతుల మీదుగా ఆవిష్క‌రించారు. అనంతరం గొర్రె కాపరుల సమస్యలపై వినతి పత్రం స‌మ‌ర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 18 శాతం ఉన్న గొల్ల కురుమలకు రాజకీయ రంగంలో రిజర్వేషన్లు ఇవ్వాలని, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, కార్పొరేషన్, చైర్మన్లు, నామినేటెడ్ పోస్టులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, మల్లన్న దేవాలయాలకు చైర్మన్లు, చదువుకున్న గొల్ల కురుమ యువతి యువకులకు పశుసంవర్ధక శాఖలో ఉద్యోగ అవకాశాలు కల్పించాల‌ని వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అధ్యక్షుడు మధు యాదవ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు చేగొండ రాజన్న యాదవ్, సాయన్న, సత్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు.

క్యాలెండ‌ర్‌ను ఆవిష్క‌రిస్తున్న ఎంపీ ఆర్‌.కృష్ణ‌య్య
క్యాలెండ‌ర్‌ను ఆవిష్క‌రిస్తున్న ఎమ్మెల్సీ ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here