ఓటు వేసి గెలిపించిన ప్ర‌జ‌ల‌కు రుణ ప‌డి ఉంటాం: కార్పొరేట‌ర్లు పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

హ‌ఫీజ్‌పేట‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్ర‌జ‌లు త‌మ‌పై న‌మ్మ‌కం ఉంచి త‌మ‌ను మ‌రోసారి కార్పొరేట‌ర్లుగా గెలిపించినందుకు వారికి రుణ ప‌డి ఉంటామ‌ని హ‌ఫీజ్‌పేట‌, మాదాపూర్ డివిజ‌న్ల కార్పొరేట‌ర్లు పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ అన్నారు. శ‌నివారం హ‌ఫీజ్‌పేట డివిజ‌న్ ప‌రిధిలోని మ‌దీనాగూడ గ్రామంలో వారు స్థానిక నాయ‌కులు, ప్ర‌జ‌ల‌తో క‌లిసి ఇంటింటికీ పాద‌యాత్ర నిర్వ‌హించారు. పెండింగ్‌లో ఉన్న ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేస్తామ‌ని తెలిపారు. ప్ర‌జ‌లు త‌మ‌కు ఏమైనా స‌మ‌స్య‌లు ఉంటే వెంట‌నే త‌మ దృష్టికి తీసుకువ‌స్తే ఆ స‌మ‌స్య‌ల‌ను త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తామ‌న్నారు. త‌మ‌కు ఓటు వేసి గెలిచించిన ప్ర‌జ‌ల‌కు వారు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, బస్తీ అధ్యక్షుడు బాలరాజు యాదవ్, గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు యాదగిరి ముదిరాజ్, ఆంజనేయులు యాదవ్, జనార్దన్ గౌడ్, రమేష్, శేఖర్ యాదవ్, వి.మల్లేష్, అమృత్ గౌడ్, అశోక్ గౌడ్, ఆంజనేయులు, రవి, నవీన్ యాదవ్, అనిత, ఝాన్సీ, మాధవి, నాగలక్ష్మి, వనజ పాల్గొన్నారు.

మ‌దీనాగూడ గ్రామంలో పాద‌యాత్ర చేస్తున్న కార్పొరేట‌ర్లు పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుంటున్న కార్పొరేట‌ర్లు పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here