ప్ర‌జ‌లు త‌మ ప‌రిస‌రాల‌ను శుభ్రంగా ఉంచుకోవాలి: భేరి రామ‌చంద‌ర్ యాద‌వ్

గ‌చ్చిబౌలి‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప‌్ర‌జ‌లంద‌రూ త‌మ ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని గ‌చ్చిబౌలి డివిజ‌న్ ప‌రిధిలోని నేతాజీ న‌గ‌ర్ వెల్ఫేర్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు భేరి రామ‌చంద‌ర్ యాద‌వ్ సూచించారు. శ‌నివారం కాల‌నీలో నెల‌కొన్న డ్రైనేజీ స‌మ‌స్య‌ను ఆయ‌న ద‌గ్గ‌రుండి ప‌రిష్క‌రింప‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కాల‌నీలో ప్ర‌తి ఒక్క‌రూ శుభ్ర‌త పాటించాల‌ని, అందుకు గాను త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌లో వ్య‌ర్థాల‌ను మూట‌గా క‌ట్టి ఓపెన్ నాలాల్లో, డ్రైనేజీల్లో ప‌డ‌వేయొద్ద‌ని, చెత్త‌ను తీసుకువెళ్లే ఆటోల్లో వేయాల‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జీహెచ్ఎంసీ సూప‌ర్ వైజ‌ర్ భ‌ర‌త్‌, కాల‌నీ అసోసియేష‌న్ సభ్యులు శంకర్, సురేష్, సాయిరాజ్, కుమార్, రాజేష్, వెంకటేష్, శ్రీను పాల్గొన్నారు.

డ్రైనేజీ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రింప‌జేయిస్తున్న భేరి రామ‌చంద‌ర్ యాద‌వ్

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here