ఎంఏ న‌గ‌ర్‌లో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ప‌ర్య‌ట‌న

మియాపూర్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏ నగర్ కాలనీలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ రోడ్ల పనులను పర్యవేక్షించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ అభివృద్ధి పనుల‌ను వేగంగా పూర్తి చేసి ప్ర‌జ‌ల‌కు ర‌హ‌దారుల‌ను అందుబాటులోకి తేవాల‌న్నారు. డివిజ‌న్ ప‌రిధిలోని ప్ర‌తి బ‌స్తీ, కాల‌నీలో సీసీ రోడ్ల అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. అన్ని ప్రాంతాల్లోనూ ర‌హ‌దారుల‌ను అభివృద్ధి చేస్తామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ నాయకులు విజయ్ ముదిరాజ్, డి రాజు గౌడ్, రవి గౌడ్, శివ ముదిరాజ్, వాణి, కాలనీ వాసులు పాల్గొన్నారు.

ర‌హ‌దారి ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here