శేరిలింగంపల్లి, ఏప్రిల్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజా పాలనకు అద్దం పట్టేలా ప్రతినిత్యం శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉదయం నుండి కార్యాలయంలో వారి సమస్యలు, అవసరాలను తెలుసుకొని, తక్షణమే వాటిని నివృత్తి చేస్తూ ప్రజా సంక్షేమానికి కృషి చేస్తానని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు, ప్రజలు ఆయనని మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సమస్యలను జోనల్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తానని, తన దృష్టికి వచ్చే ప్రతి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు.