శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 4 (నమస్తే శేరిలింగంపల్లి): మన పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకోవాలని నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ అన్నారు. కాలనీ పరిధిలోని ఓపెన్ నాలాలో మురుగు నీరు నిండిపోయి దుర్వాసన వెదజల్లుతూ దోమలు విజృంభిస్తుండడంతో ఆయన జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇచ్చి నాలాను శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. లేదంటే దోమలు విజృంభిస్తాయని, దీంతో రోగాల బారిన పడతారని అన్నారు. చెత్త, వ్యర్థాలను కచ్చితంగా మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలని సూచించారు. ఆయన వెంట కాలనీ ఉపాధ్యక్షుడు రాయుడు, మణికంఠ, అసోసియేషన్ సభ్యులు ఉన్నారు.