అంగరంగ వైభవంగా రాగం వారి మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవం, నూతన గృహ ప్రవేశ కార్యక్రమం

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 4 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): రాగం దంపతుల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు వరుసగా బృహత్తర భక్తి కార్యక్రమాలు నిర్వహించారు. గంగ తెప్పోత్సవం, మరుసటి రోజు మల్ల‌న్న స్వామి కళ్యాణ మహోత్సవం, ఫిబ్రవరి 3వ తేదీన నూతన గృహ ప్రవేశ కార్యక్రమాల‌ను ఘనంగా నిర్వహించారు. శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మాజీ స్టేట్ సోషల్ వెల్పేర్ బోర్డు చైర్ ప‌ర్సన్ రాగం సుజాత యాదవ్ నల్లగండ్లలోని కింగ్‌స్ట‌న్ వెర్టెస్‌ విల్లా-224 లో గృహ ప్రవేశం సందర్భంగా మూడు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

మొదటి రోజైన ఫిబ్రవరి 1వ తేదీన సాయంత్రం 4 గంటలకు గంగా తెప్పోత్సవ కార్యక్రమం కన్నుల పండుగా సాగింది. నూతన గృహ ప్రవేశం సందర్భంగా గంగా తెప్పోత్సవ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో కన్నుల పండుగ‌గా జరుపుకున్నారు. యాదవుల ఆరాధ్య దైవమైన మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 2వ‌ తేదీన రాగం దంపతులు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఫిబ్రవరి 3వ తేదీన నూతన గృహ ప్రవేశం కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల మధ్య కోలాహం మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాలకు శేరిలింగంపల్లి శాసనసభ్యుడు ఆరెక‌పూడి గాంధీ, డివిజన్ల కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, పలువురు ప్రముఖులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు హాజ‌ర‌య్యారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here