శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 4 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులలో భాగంగా చేపడుతున్న గుర్రపు డెక్క తొలగింపు పనులకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, సంరక్షణ,అభివృద్ధి పనులు తుది దశలో ఉన్నాయన్నారు. ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని, గుర్రపు డెక్క తొలగింపు పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. గుర్రపు డెక్క తొలగింపు పనులలో వేగం పెంచాలని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు , కార్యకర్తలు, మహిళ నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.