హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట డివిజన్ పరిధిలో తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి డివిజన్ బీజేపీ అభ్యర్థి బోయిని అనూష మహేష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆమె డివిజన్ బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తనకు సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్తకి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి కార్యకర్త ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు. డివిజన్ లో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు తమ శాయశక్తులా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేష్ యాదవ్, కోటేశ్వరరావు, శ్రీశైలం యాదవ్, బాబు రెడ్డి, జితేంద్ర, పవన్, ఉమ, మృదుల, మనోజ్, శ్రీనివాస్, నవీన్ పాల్గొన్నారు.

