శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్ లో ఉన్న అంబేద్కర్ కూడలి వద్ద డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వార్డు మెంబర్ గౌరి, సెక్రటరీ బలరాం, తెరాస నాయకులు నందు, గువ్వల రమేష్, చారి, తిరుపతి రెడ్డి, సాగర్ చౌదరి, వెంకటేష్, గణపతి, పూజ, గణేష్ యాదవ్, జి.రాజు, వినోద్, శ్రీను, బస్వారాజ్, రవి నాయక్, ఆనంద్, రాజు, కృష్ణ, రాజేష్, సునీత పాల్గొన్నారు.

చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ జాతీయ రహదారి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి హఫీజ్‌పేట, మాదాపూర్ డివిజన్ల కార్పొరేటర్లు పూజిత, జగదీశ్వర్ గౌడ్‌లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

మియాపూర్‌లోని ముజఫర్ అహ్మద్ నగర్‌లో ఉన్న ఎంసీపీఐ(యూ) కార్యాలయంలో అంబేద్కర్ చిత్ర పటానికి ఆ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కన్నా శ్రీనివాస్, మైదం శెట్టి రమేష్, తాండ్ర రమేష్, వై. రాంబాబు, టి అనిల్ కుమార్, మధుసూదన్, ఆకుల రమేష్, ఎం.చందర్ పాల్గొన్నారు.

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల సాయినగర్ లో ఉన్న శిశుమంగల్ అనాథ ఆశ్రమంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చిన్నారులకు పండ్లు, బిస్కెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, పాలం శ్రీను, బాబ్జి చౌదరి, ఆశ్రమం నిర్వాహకులు పాల్గొన్నారు.

మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండాలో అంబేద్కర్ విగ్రహానికి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఇస్లావత్ దశరథ్ నాయక్, తారామ్ నాయక్, స్వామి నాయక్, క్రిష్ణ నాయక్, రెడ్యానాయక్, శంకర్ నాయక్, మధుసూధన్ నాయక్, పాండు నాయక్, అబ్రహాం, సుధాకర్, రమేష్ నాయక్, మోహన్ నాయక్ పాల్గొన్నారు.
