చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, దివంగత ఉస్మాన్ బేగ్ కుటంబ సభ్యులు యూసఫ్ పాషా, నిస్సార్ అహ్మద్, ఖదీర్ పాషా, మిర్జాడ్ అబ్దుల్ బేగ్, సయ్యద్ నూరుద్దీన్, మహేందర్, 500 మంది మైనారిటీ నాయకులు, కార్యకర్తలు తెరాస నాయకుడు మీర్జా మహమూద్ బేగ్ ఆధ్వర్యంలో చందానగర్ డివిజన్ తెరాస పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మంజుల రఘునాథ్ రెడ్డి గెలుపు కోసం సోమవారం ప్రభుత్వ విప్, చందానగర్ డివిజన్ ఇంచార్జ్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, నారాయణ ఖేడ్ శాసన సభ్యుడు భూపాల్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీల సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. వారందరికీ నాయకులు తెరాస పార్టీ కండువాలు కప్పి సాదరంగా తెరాస పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం తెరాస ప్రభుత్వమని అన్నారు. అన్ని వర్గాలకు సమన ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ సీఎం కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉన్న సీఎం కేసీఆర్ విజన్‌తో ముందుకెళ్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆరేండ్లలో చేసిన అభివృద్ధిని గ్రహించిన ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రఘుపతి రెడ్డి, మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు, మాజీ కౌన్సిలర్ సునీత ప్రభాకర్ రెడ్డి, తెరాస నాయకులు మిరియాల రాఘవరావు, జేరిపాటి రాజు, వెంకటేష్, జనార్దన్ రెడ్డి ప్రవీణ్, రాంచందర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, అక్బర్ ఖాన్, పీవై రమేష్, గురుచరణ్ దూబే, గౌస్, సలీమ్, భాను, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
