శ్రీ‌రామ్ న‌గ‌ర్ కాల‌నీలో హ‌మీద్ ప‌టేల్ ఇంటింటికీ ప్ర‌చారం

కొండాపూర్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని శ్రీ‌రామ్ న‌గ‌ర్ కాల‌నీలో డివిజ‌న్ తెరాస అభ్య‌ర్థి హ‌మీద్ ప‌టేల్ సోమ‌వారం ఇంటింటికీ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాల‌ని కోరారు. తెరాస ప్ర‌భుత్వం హ‌యాంలోనే డివిజ‌న్ అభివృద్ది చెందింద‌న్నారు. ప్ర‌జ‌లు అభివృద్ధికి ప‌ట్టం క‌ట్టాల‌ని కోరారు. త‌న‌ను కార్పొరేట‌ర్ గా మ‌రొక‌సారి గెలిపిస్తే డివిజ‌న్‌ను ఆద‌ర్శ‌వంతంగా తీర్చిదిద్దుతామ‌న్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీలు చెప్పే క‌ల్లబొల్లి మాట‌ల‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌వ‌ద్ద‌ని, స్వ‌చ్ఛ‌మైన పాల‌నను అందిచే నేత‌ల‌నే ఎన్నుకోవాల‌ని అన్నారు. డిసెంబ‌ర్ 1న జ‌ర‌గ‌నున్న పోలింగ్‌లో కారు గుర్తుకు ఓటేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

ఇంటింటికీ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న హ‌మీద్ పటేల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here