శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో హర్షణీయం అని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. జంట నగరాల ప్రజలపై ఉన్న అభిమానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి వ్యక్తం చేశారని అన్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిద్దిన తరుణంలో జిహెచ్ఎంసి లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చి సమగ్రాభివృధ్దికి బాటలు వేయనున్నారని అన్నారు. తెరాస ప్రభుత్వం డిసెంబర్ నుంచి జంట నగరాల ప్రజలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా మంజీరా నీటిని సరఫరా చేయడం హర్షణీయమని, జిహెచ్ఎంసి తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్షౌర శాలలకు, రజక సామాజిక ప్రజలందరూ తాము దోబి ఘాట్ ల వద్ద వాడుతున్న విద్యుత్ కు , లాండ్రీలకు వాడుతున్న విద్యుత్ ను ప్రభుత్వం డిసెంబర్ మాసం నుండి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల పక్షపాతి అని కొనియాడారు. గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని సంక్షేమ పథకాలను తెరాస ప్రభుత్వం చేపడుతుందన్నారు.పేద ప్రజలకు ఆసరా పింఛన్లు, ఆడపడుచులకు షాదీముబారక్, ఇండ్లు లేని పేదలకు డబుల్ ఇండ్ల నిర్మాణం చేపట్టిన ఘనత కేసీఆర్ కె సాధ్యం అన్నారు. మెట్రో రైల్ రెండో దశలో భాగంగా బిహెచ్ఇఎల్ వరకు విస్తరణ చందానగర్ డివిజన్ ప్రజలకు శుభవార్త అన్నారు. కెసిఆర్ మేనిఫెస్టో ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారని ప్రభుత్వ విప్ గాంధీ తెలియజేశారు.