ప్ర‌శాంత్ న‌గ‌ర్ కాల‌నీలో వాట‌ర్ వ‌ర్క్స్ అధికారుల ప‌ర్య‌ట‌న

శేరిలింగంప‌ల్లి, మార్చి 24 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీలో సాయిబాబా ఆల‌య రోడ్డులో డ్రైనేజీ పొంగి పొర్లుతుంద‌ని స్థానికులు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేయ‌గా అధికారులు స్పందించారు. ప‌లు శాఖ‌ల‌కు చెందిన అధికారులు కాల‌నీని సంద‌ర్శించారు. కాల‌నీలో కేవ‌లం ఒక్క ఫీట్ పైప్ లైన్ తీశార‌ని, అది స‌రిపోవ‌డం లేద‌ని, నాలుగు ఫీట్ల పైప్ లైన్ తీయాల‌ని స్థానికులు కోర‌గా అందుకు అధికారులు స్పందించారు. ఈ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపిస్తామ‌ని వాట‌ర్ వ‌ర్క్స్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అధికారుల‌కు కాల‌నీవాసులు, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు ర‌క్త‌పు జంగం గౌడ్‌, యాద‌న్న ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో వాట‌ర్ వ‌ర్క్స్ ఈడీ సంతోష్ రెడ్డి, డైరెక్ట‌ర్ బి.నారాయ‌ణ‌, డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ శ్రీ‌హ‌రి, మేనేజ‌ర్ అరుణ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here