శేరిలింగంపల్లి, అక్టోబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని FCI కాలనీలో కృష్ణ సాయి అపార్ట్మెంట్స్ లో వాటర్ హెడ్ ఇండియా సంస్థ సౌజన్యం తో రూ. 3 లక్షల 50 వేలతో చేపట్టిన బోర్ పునరుద్ధరణ పనులు పూర్తయిన సందర్భంగా వాటర్ హెడ్ ఇండియా సంస్థ సభ్యులు, అపార్ట్మెంట్స్ అసోసియేషన్ సభ్యులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ వాటర్ హెడ్ ఇండియా సంస్థ సౌజన్యంతో చేపట్టిన బోర్ పునరుద్ధరణ పనులు, ఇంకుడు గుంతల పనులు పూర్తయిన సందర్భంగా వాటర్ హెడ్ ఇండియా సంస్థ సభ్యులు, అపార్ట్మెంట్స్ అసోసియేషన్ సభ్యులతో కలసి ప్రారంభించడం జరిగిందని, అపార్ట్మెంట్స్ లో బోరు పునరుద్ధరణ పనులు ఇంకుడు గుంతలను నిర్మించడం చాలా అభినందించదగ్గ విషయం అని అన్నారు. వాటర్ హెడ్ ఇండియా సంస్థ సేవలు అమోఘం అని, కాలనీలలో సామాజిక దృక్పథంతో సమాజ సేవకు వారు చేస్తున్న సేవలు చాలా గొప్పవి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ సాయి అపార్ట్మెంట్ అసోసియేషన్ వాసులు, వాటర్ హెడ్ ఇండియా సంస్థ సభ్యులు విజయరేఖ, బాలు తదితరులు పాల్గొన్నారు.






