జ‌ల‌మండ‌లి, జీహెచ్ఎంసీ అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, అక్టోబ‌ర్ 28 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనులపై జలమండలి MD అశోక్ రెడ్డి, HMWS & SB డైరెక్టర్ ఆపరేషన్స్ పీవీ శ్రీధర్, సీజీఎం నారాయణ, జనరల్ మేనేజర్లు కృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, హరిశంకర్, కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, రాగం నాగేందర్ యాదవ్, హమీద్ పటేల్, దొడ్ల వెంకటేష్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, జలమండలి అధికారులతో హైదర్ నగర్ జలమండలి కార్యాలయంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలని, అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా పనిచేయాలని అన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, ప్రజా సమస్యలపై అధికారులు నిర్లిప్తతను విడాలని, త‌మ దృష్టికి ప్రజల నుండి వచ్చిన ప్రజా సమస్యల పై స్పందించే అవసరం ఎంతైనా ఉంద‌ని అన్నారు. GHMC , జలమండలి అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్లాలని, పనుల స్థితిగతి, పనుల పురోగతి, కొత్త ప్రతిపాదనలు, మంజూరైన పనులు, శంకుస్థాపనకు సిద్ధమైన వాటి సమగ్ర సమాచారంపై సమీక్షించాల‌ని అన్నారు.

ఈ కార్యక్రమంలో DGM నారాయణ, DGM నాగప్రియ, DGM శరత్ రెడ్డి, DGM నరేందర్, మేనేజర్లు, నాయకులు సంజీవరెడ్డి, నాయినేని చంద్రకాంత్ రావు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, మంత్రి ప్రగడ సత్యనారాయణ, MD ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here