శేరిలింగంపల్లి, అక్టోబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి బిజెపికి రాజీనామా చేసి తిరిగి బి ఆర్ ఎస్ పార్టీలో చేరుతున్నందుకు ఆమెకి పలువురు బీఆర్ఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆమెను కలిసిన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి, నాయకుడు పారునంది శ్రీకాంత్ లు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు.






