వివికె హౌజింగ్ ఇండియా కార్యాలయం ప్రారంభించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన విజన్ వివికె హౌజింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ నూతన కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, ప్రముఖ సినీతార రాశి తో కలిసి ప్రారంభించారు. నూతన కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో వెనక్కి తిరిగి‌ చూడకూడదని, విజయాల వైపు దూసుకెళ్లాలని అన్నారు. రక్తదానం చేయడం గొప్ప విషయమని అన్నారు.

నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

ఈ కార్యక్రమంలో హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, నాయకులు పురుషోత్తం యాదవ్, సంగారెడ్డి, మోహన్ ముదిరాజ్, అక్తర్, మాధవరం గోపాల్ రావు, శ్రీనివాస్ గోపారాజు, రవీందర్ రెడ్డి, కృష్ణ ముదిరాజ్, దొంతి శేఖర్, వెంకటేష్, కంది జ్ఞానేశ్వర్, ప్రవీణ్, జనార్దన్, ఓ వెంకటేష్, శివ, జహీర్ ఖాన్, రాము తదితరులు పాల్గొన్నారు.

బ్రోచ‌ర్‌ను రిలీజ్ చేస్తున్న ప్ర‌ముఖ సినీన‌టి రాశీ, సీరియ‌ల్ ఫేమ్ మ‌హ‌తి, సంస్థ అధినేత విజ‌య్‌కుమార్‌, టీఆర్ఎస్ నాయ‌కుడు గోపారాజు శ్రీనివాస్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here