హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పూర్తి చేసిన పట్టభద్రుల ఓటరు నమోదు పత్రాలను సోమవారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి తెరాస నాయకుడు జి.రోహిత్ ముదిరాజ్ అందజేశారు. మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ఆదేశాల మేరకు, హఫీజ్‌పేట వార్డు మెంబర్ శేఖర్ ముదిరాజ్ పర్యవేక్షణలో పట్టభద్రుల ఓటరు నమోదు పత్రాలను పూర్తి చేయడం జరిగిందని రోహిత్ ముదిరాజ్ తెలిపారు. శేరిలింగంపల్లి డివిజన్‌లో 9 మంది తెరాస కార్పొరేటర్లు విజయం సాధించినందుకు గాను గాంధీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
