శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి డివిజన్ తెరాస కార్పొరేటర్‌గా మళ్లీ గెలుపొందినందుకు గాను రాగం నాగేందర్ యాదవ్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్‌లు సోమవారం ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెరాస అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో సీఎం కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు రవి యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, డివిజన్ ఉపాధ్యక్షులు పన్యల యాదా గౌడ్, విష్ణు వర్ధన్ రెడ్డి, దినేష్, రవి యాదవ్, గోపాల్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, శ్రీకాంత్, మహేందర్ సింగ్, శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
